టాలీవుడ్ దర్శకుడితో సూర్య మూవీ

కోలీవుడ్ హీరో సూర్య ఎట్టకేలకు టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. తెలుగులో ఓ స్ట్రయిట్ మూవీ చేస్తానంటూ
చాన్నాళ్లుగా ఊరిస్తున్న ఈ హీరో, ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
కుదిరితే త్రివిక్రమ్, కుదరకపోతే బోయపాటితో ఓ సినిమా చేసేందుకు సూర్య సన్నాహాలు చేస్తున్నాడట.

సూర్యకు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే అతడి సినిమా ఎలా ఉన్నా చూసే ఫ్యాన్స్ లేరు.
సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. సూర్య సినిమాలపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కొన్ని
అంచనాలున్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగా తెలుగులో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట సూర్య.

తెలుగు ఆడియన్స్ పల్స్ ఏంటనేది అటు బోయపాటి, ఇటు త్రివిక్రమ్ కు బాగా తెలుసు. పైగా స్టార్
హీరోల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. సూర్య లైన్లోకి వస్తే కచ్చితంగా వీళ్లకు కోలీవుడ్ లో
కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది. అందుకే సూర్యతో సినిమా అనగానే చేయడానికి ఇంట్రెస్ట్
చూపిస్తున్నారు. త్వరలోనే సూర్య డెబ్యూ మూవీపై ఓ ప్రకటన వచ్చేలా ఉంది.