ఏపీలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతుండడంతో,
సినిమా హాళ్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ కూడా కొన్ని నియమాలు,
నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సెకెండ్ షో ఉండదు. 50శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉంటుంది.

కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శానిటైజర్లు
ఏర్పాటు చేయడంతో పాటు, సీటు వదిలి సీటుకు టిక్కెట్ ఇవ్వాలని సూచించింది. ప్రతి షో పూర్తయిన
తర్వాత థియేటర్ మొత్తం శానిటైజ్ చేయాలని ఆదేశించింది.

రాత్రి 10 గంటల తర్వాత సినిమా థియేటర్లు రన్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కర్ఫ్యూ నిబంధనల్ని
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలించారు. అయితే ఈ నిబంధనలన్నీ పాజిటివిటీ
రేటు 5శాతం లోపు ఉన్న జిల్లాలకు మాత్రమే. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా థియేటర్లకు అనుమతి
లభించలేదు.