‘డెవిల్’ గా మారిన కల్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 21వ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చేసింది. ఈ చిత్రానికి
‘డెవిల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్‌లైన్‌. ‘డెవిల్’ అనే టైటిల్
క‌థానాయ‌కుడి పాత్ర‌లోని ప‌వ‌ర్‌ను తెలియ‌జేసేలా ఉంది. దేవాంశ్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ
సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని
నిర్మించ‌నున్నారు.

క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ లుక్ చూస్తుంటే చాలా
డిఫ‌రెంట్‌గా ఉంది. పంచెక‌ట్టులో క‌ళ్యాణ్‌రామ్ కోటు ధ‌రించాడు. అంతే కాకుండా ట్రెయిన్ నుంచి
బ‌య‌ట‌కు వ‌స్తూ చేతిలో తుపాకీ ప‌ట్టుకుని ఎవ‌రో కాలుస్తున్నాడు. త‌లపై గాయ‌మైంది, గ‌డ్డం, మెలి
తిరిగిన మీసాల‌తో చూపుల్లో ఓ ఇంటెన్స్ క‌నిపిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే నిజంగానే క‌ళ్యాణ్‌రామ్ డెవిల్‌లా
క‌నిపిస్తున్నారు. ట్రెయిన్‌పై చాలా మంది భార‌తీయులు కూర్చుని ఉన్నారు.

మ‌న దేశానికి స్వాతంత్య్రం రాక ముందు, ..1945 బ్రిటీష్ ఇండియా, మ‌ద్రాస్ ప్రెసిడెన్సిలో బ్యాక్‌డ్రాప్‌లో
సినిమా ఉంటుంది. ఎవ‌రికీ తెలియ‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించ‌డానికి నియ‌మించ‌బ‌డ్డ ర‌హ‌స్య గూఢ‌చారే
‘డెవిల్‌’. ఈ ర‌హ‌స్యం అత‌ను ఊహించిన దాని కంటే మ‌రింత లోతుగా ఉంటుంది. ఈ ప్ర‌యాణంలో
అత‌ను ప్రేమ‌, మోసం, ద్రోహం అనే వ‌ల‌యాల్లో ఎలా చిక్కుకున్నాడు. ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ.
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది డెవిల్.