ఈసారి అన్నీ మంచి శకునాలే

‘ఏక్‌ మిని కథ’ సినిమా తర్వాత ఒక్కసారిగా బిజీ అయిపోయాడు హీరో సంతోష్ శోభన్. ఎలాంటి హడావుడి
లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫస్ట్ లుక్కో, మోషన్ పోస్టరో వచ్చే వరకు
అతడు సినిమా చేస్తున్న విషయం బయటకు రావడం లేదు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై కూడా ఇలానే
సైలెంట్ గా ఓ సినిమా పూర్తిచేస్తున్నాడు ఈ హీరో.

సంతోష్‌ శోభన్ హీరోగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. దీనికి అన్నీ మంచి శకునములే
అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ను ఈ రోజు అధికారికంగా విడుదల
చేశారు. టైటిల్‌ మాదిరిగానే పోస్టర్‌ కూడా చాలా ఛార్మింగ్‌గా ఉంది.

‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలోని క్లాసిక్‌ సాంగ్‌ ‘అన్నీ మంచి శకునములే’ నుంచి ఈ సినిమా టైటిల్‌ను
తీసుకున్నారు. అలాగే ఆ సాంగ్‌లోని కొంత భాగం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ లో కూడా మ‌నం వినొచ్చు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభ‌మైన‌ ఈ చిత్రంలో సంతోష్‌శోభన్, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా
నటిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత
సీనియర్ నటి గౌతమి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.