పవన్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆగిపోయిన సినిమాల్లో పవన్ కల్యాణ్ మూవీ కూడా ఉంది. పవన్-రానా హీరోలుగా
నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చాన్నాళ్ల కిందటే ఆగిపోయింది. మధ్యలో పవన్ కల్యాణ్
కూడా కరోనా బారిన పడ్డారు. అలా ఆగిపోయిన పవన్-రానా మూవీ మళ్లీ మొదలుకాబోతోంది.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ కు పవన్ కల్యాణ్ కాల్షీట్లు
కేటాయించారు. ఈనెల 12 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈసారి పవన్, రానాతో పాటు..
హీరోయిన్ నిత్యామీనన్ కూడా సెట్స్ పైకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమాలో సాయిపల్లవిని అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో
ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్ కు భార్యగా కనిపించనుంది
నిత్యామీనన్. ఈ షెడ్యూల్ లో నిత్యామీనన్ కు సంబంధించిన సీన్స్ అన్నీ పూర్తిచేయబోతున్నారు.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్
మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మూవీలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.