ఎట్టకేలకు సెట్స్ పైకి బన్నీ

అల్లు అర్జున్ సెట్స్ పైకొచ్చాడు. ఈరోజు పుష్ప మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. 45 రోజుల లాంగ్
షెడ్యూల్ ఇది. ముందుగా సికింద్రాబాద్ లో ఈ సినిమా షూట్ ఈరోజు మొదలైంది. సికింద్రాబాద్ శివార్లలో
వేసిన అడవి సెట్ లో షూట్ చేస్తున్నారు. దీని తర్వాత యూనిట్ మొత్తం బూత్ బంగ్లాకు షిఫ్ట్ అవుతుంది.
అక్కడ కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత, అన్నపూర్ణ స్టుడియోస్ కు షిఫ్ట్ అవుతారు.

ఆ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే రంప చోడవరం వెళ్లి, అక్కడ అడవుల్లో షూటింగ్ చేస్తారు. ఒకవేళ
పరిస్థితులు అనుకూలించకపోతే, అన్నపూర్ణ స్టుడియోస్ లోనే షూటింగ్ కొనసాగిస్తారు. మొత్తమ్మీద 45
రోజుల్లో పుష్ప పార్ట్-1కు సంబంధించి టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని ఫిక్స్ అయింది యూనిట్. ఈ
మేరకు పకడ్బందీగా కాల్షీట్లు సెట్ చేసుకుంది.

బన్నీ పూర్తిగా అందుబాటులో ఉన్నాడు. బాలీవుడ్ మూవీస్ చేస్తున్న రష్మిక నుంచి కూడా కాల్షీట్లు
తీసుకొచ్చారు. ఇక మరో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ నుంచి కూడా 2 రోజుల కాల్షీట్లు తీసుకున్నారు. పుష్ప
సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప పార్ట్-1 రిలీజ్ డేట్
ఎనౌన్స్ చేస్తారు. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.