పచ్చబొట్టు బయటపెట్టిన హీరోయిన్

హీరోయిన్ సంజనా గల్రానీ తన పచ్చబొట్టు రహస్యాన్ని విప్పింది. తన ఒంటిపై ఓ పచ్చబొట్టు ఉందని,
ఇప్పటివరకు దాన్ని ఎవ్వరికీ చూపించలేదంటూ ఊరిస్తూ వచ్చిన ఈ హీరోయిన్, ఎట్టకేలకు ఆ టాటూ
సీక్రెట్ ను బయటపెట్టింది.

సంజన మెడ వెనక భాగంలో ఈ పచ్చబొట్టు ఉంది. ఈరోజు దాన్ని ఆమె బయటపెట్టింది. ఇంతకీ ఆ
టాటూలో ఏముందో తెలుసా? సంజనా గల్రానీ, తన భర్త పేరు అజీజ్ ను పచ్చబొట్టుగా వేయించుకుంది.
దాన్నే ఈరోజు బయటపెట్టింది.

సంజన, అజాజ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల పెళ్లయిన ఏడాది తర్వాత ఈ
విషయం బయటకొచ్చింది. పెళ్లి ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఈరోజు పచ్చబొట్టు మేటర్
బయటపెట్టిన సంజన.. తనకు తన భర్తకు 15 ఏళ్లుగా పరిచయం ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చింది.