నాలుగేళ్ల తర్వాత మరో సినిమా

టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒక‌వైపు స్టార్ హీరోలతో హై
బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మ‌రోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత
చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై ఏజెంట్ సాయి
శ్రీ‌నివాస ఆత్రేయ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ద‌ర్శ‌కత్వంలో
కొత్త సినిమాను స్టార్ట్ చేశారు.

ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ పెట్టారు. ఇటీవ‌ల విడుద‌ల‌చేసిని థీమ్ పోస్ట‌ర్‌కి
ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో
మ‌న‌ముందుకు వ‌చ్చారు మేక‌ర్స్‌.

2017లో వచ్చిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ `ఆనందో బ్రహ్మ` సినిమాలో చివ‌ర‌గా తెలుగు తెరపై కనిపించింది
తాప్సీ. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తాప్సీ తాజాగా మిషన్ ఇంపాజిబుల్
సినిమాలో లీడ్‌ రోల్‌లో న‌టిస్తోంది.

ఈ రోజు నుండి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయింది తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్క‌మ్
చెప్పింది చిత్ర యూనిట్‌. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను
రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.