ఆచార్య ఆఖరి షెడ్యూల్

ఎట్టకేలకు ఆచార్య సినిమా మళ్లీ సెట్స్ పైకొచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు
సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యూల్. అటుఇటుగా 12-15 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో
కీలకమైన నటీనటులంతా పాల్గొంటున్నారు.

హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన ధర్మస్థలి సెట్ లోనే ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సెట్
లోనే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చిరంజీవి-పూజాహెగ్డే మధ్య ఓ సాంగ్ కూడా తీయబోతున్నారు. ఇదే
షెడ్యూల్ లో చిరంజీవితో పాటు కాజల్ కూడా జాయిన్ అవ్వబోతోంది. చిరంజీవి, కాజల్, చరణ్ మధ్య
వచ్చే సన్నివేశాలు కూడా ఈ షెడ్యూల్ లోనే పూర్తిచేయబోతున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆచార్య విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. కొరటాల శివ
దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత. చిరంజీవి సహనిర్మాత. మణిశర్మ
సంగీతం అందిస్తున్నాడు.