చైతూకు హీరోయిన్ దొరికేసింది

బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ ప్రక్రియ మొదలైంది. నాగార్జున, నాగచైతన్య కాల్షీట్లు సెట్
అయ్యాయి. ఇప్పుడు నాగచైతన్య కు హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కృతి శెట్టి
పేరు తెరపైకొచ్చింది. చైతూ సరసన నటించడానికి కృతి షెట్టి దాదాపు అంగీకరించినట్టు తెలుస్తోంది.

కృతి షెట్టి ఇప్పటికే చాలా బిజీగా ఉంది. నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది. మరో 5 రోజుల్లో రామ్
తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె బంగార్రాజు సినిమాకు కాల్షీట్లు కేటాయించడం
కాస్త ఆశ్చర్యమే.

‘ఉప్పెన’ తో మంచి క్రేజ్ అందకున్న కృతి.. చైతు సరసన హీరోయిన్ గా కనిపిస్తే సినిమాకు ప్లస్
అవుతుందని భావించి ఆమెను సంప్రదించారట. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చేసిందట కృతి. త్వరలోనే సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ రానుంది. మరి ఎనౌన్స్ మెంట్ కే
చైతు, కృతి పేర్లు కూడా చెప్పేస్తారా? లేదా ఓన్లీ సీక్వెల్ విషయం ఒక్కటే చెప్తూ టైటిల్ తో ఎనౌన్స్ మెంట్
మాత్రమే ఇస్తారో చూడాలి.