నితిన్ సరసన పూజాహెగ్డే

స్టార్ హీరోయిన్లను తన సినిమాల్లో తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు హీరో నితిన్. ప్రియమణి,
జెనీలియా, ఇలియానా, సమంత, రష్మిక, రకుల్.. ఇలా ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించిన ఈ హీరో, ఇప్పుడు పూజాహెగ్డేపై కన్నేశాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రైజింగ్ లో ఉంది పూజాహెగ్డే. ఆచార్య సినిమాతో పాటు అటు తమిళ్, ఇటు హిందీ
భాషల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మను తన సినిమాలో హీరోయిన్ గా లాక్ చేశాడు నితిన్.
ప్రస్తుతం నిర్మాతలు పూజాహెగ్డేకు ఎంత పేమెంట్ ఇస్తున్నారో, అంతకంటే ఓ 20 లక్షలు ఎక్కువకే
పూజాను లాక్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మాస్ట్రో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు నితిన్. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్
అవుతుంది. ఈ మూవీ రిలీజైన వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఈ
హీరో. ఆ సినిమా కోసమే పూజా హెగ్డే కాల్షీట్లు దక్కించుకున్నాడు.