రామ్, కృతి షెట్టి కలిశారు

లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ పోతినేని షూటింగ్ చేయడానికి రెడీ అయ్యాడు. బౌండ్ స్క్రిఫ్ట్‌తో దర్శకుడు
లింగుసామి రెడీ. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లడానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి
రెడీ. అనువాద సినిమాలతో తమిళ, హిందీ ప్రేక్షకులకు రామ్ చేరువైనా… స్ట్రయిట్ తమిళ సినిమా
చేయలేదు. అటు దర్శకుడు లింగుసామి తెలుగులో చేయలేదు. అందుకని, ఈ కాంబినేషన్‌లో తెలుగు,
తమిళ బైలింగ్వల్ సినిమాను ఎవరూ ఊహించలేదు. అలా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమాను
ప్రకటించారు.

ఇప్పుడీ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అయింది. ఈనెల 12 నుంచి రామ్-లింగుసామి సినిమా సెట్స్
పైకి వెళ్తుంది. పైనల్ డిస్కషన్ లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి కూడా రామ్, లింగుసామి, నిర్మాతను
కలిసింది.

‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి
చేస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. ‘దృశ్యం’, ‘లూసిఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసిన
టాప్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ‘కె.జి.యఫ్’ చిత్రానికి పని చేసిన
అన్బు-అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ప్రముఖ సంభాషణల రచయిత
సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్
బాధ్యతలు చూస్తున్నారు.