షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న
భారీ చిత్రం `కిరాత‌క‌`. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన `కిరాత‌క` టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు `కిరాతక` ఫ‌స్ట్ లుక్
పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుండి
ప్రారంభంకానుంది. ఇలా రెగ్యులర్ షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, సినిమాపై కాస్త బజ్
క్రియేట్ చేశారు మేకర్స్.

టైటిల్ కు తగ్గట్టే సినిమా కథ కిరాతకంగా ఉంటుందట. సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్ అందర్నీ
మెప్పిస్తాయంటున్నాడు వీరభద్రమ్. అయితే హీరో ఎందుకు కిరాతకంగా మారాడనేది సస్పెన్స్
అంటున్నాడు.