లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ రిలీజ్ ఇదే

లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఏపీలో కూడా థియేటర్లు
తెరవడంతో చిన్న చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. కాస్తోకూస్తో పేరున్న మూవీ వీటిలో ఏదైనా
ఉందంటే అది తిమ్మరుసు మాత్రమే. అవును.. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా.. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి క్రేజీ మూవీగా నిలిచింది.

బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విల‌క్షణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌
సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్కర్
హీరోయిన్‌. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి
డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి
దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్
పెట్టి మరీ ప్రకటించారు.

సినిమాలో సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో నటించాడు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా
ఉంటుంది. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేస్తారు.