బన్నీ కూతురుతో భారీ మూవీ

చిన్న పిల్లలు సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. కాకపోతే అందులో క్లిక్ అయిన సినిమాలు చాలా
తక్కువ ఉంటాయి. ఎన్టీఆర్ బాలనటుడిగా చేసిన రామాయణం అనే సినిమా ఇప్పటికీ ఎంతో స్పెషల్. ఇక
లిటిల్ సోల్జర్స్ అనే సినిమా ఈ జానర్ లో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అటు అఖిల్ నటించిన సిసింద్రీ
కూడా ఆకట్టుకుంది. ఇలా 2-3 సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు వీటికి తలదన్నే రీతిలో ఓ
బాలల చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నాడట నిర్మాత దిల్ రాజు. దీని కోసం అతడు భారీ స్కెచ్
రెడీ చేశాడు.

అల్లు అర్జున్ కూతురు ఆర్హ తో ఓ చిల్డ్రన్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. దిల్ రాజు కాంపౌండ్ లో
ఉండే సురేష్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడని తెలుస్తుంది. ఆర్హ ఇటివలే ఓ
మ్యూజిక్ వీడియోలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోతో పాటు.. ఇనస్టాగ్రామ్
లో అర్హ వీడియోస్ చూశాక దర్శకుడు సురేష్ కి ఆర్హ తో సినిమా తీయాలనే ఆలోచన తట్టిందట.

ప్రస్తుతానికైతే ఈ సినిమాపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఆర్హ తో
సినిమా అనగానే వెంటనే ఓకె చెప్పేశారట. మరి ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో క్యూట్ గా
కనిపించే ఆర్హ నిజంగా సినిమా చేస్తే అందులో ఎలా నటిస్తుందో చూడాలి.