నితిన్ నుంచి మ్యూజిక్ ఫెస్ట్

హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీల ఫస్ట్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం
`మ్యాస్ట్రో`. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్
తమన్నా విలన్ గా కనిపించనుంది.

ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్త‌య్యింది. నెక్ట్స్ వీక్ నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుంది.
అంటే పాటల విడుదల కార్యక్రమం అన్నమాట. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ బీచ్‌లో
పియానో వాయిస్తూ క‌నిపిస్తున్నారు.

నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు సంగీతం అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో
చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి
మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై నితిన్ తండ్రి ఎన్‌. సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ
సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు అమ్మేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ విషయాన్ని ఇంకా
అధికారికంగా ప్రకటించలేదు.