మహేష్ మూవీ విలన్ ఎవరు?

మహేష్ హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు సంబంధించి చాలా అప్ డేట్స్
బయటకొస్తున్నాయి. కొత్త షెడ్యూల్ వివరాలు కూడా బయటకొచ్చాయి. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరనే
అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా సముత్తరఖని కూడా వచ్చి చేరాడు.

బ్యాంక్ లావాదేవీలు, బ్యాంక్ లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వైట్ కాలర్ మోసాలు కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమాలో సముత్తరఖనిని విలన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన క్రాక్ సినిమాలో సముత్తరఖని
విలనిజం బాగా పండిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా
విలన్ గా నటించాడు ఈ నటుడు.

ఇవన్నీ చూసి సర్కారువారి పాట సినిమాలో కూడా ఈ తమిళ నటుడ్ని తీసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి సముత్తరఖని కంటే ముందు అర్జున్, ఉపేంద్ర లాంటి నటుల పేర్లు తెరపైకొచ్చాయి. మరి మహేష్ సినిమాలో విలన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.