నేను గొప్పవాడ్ని కాదు.. నాగార్జున

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ చుక్కలు చూపించింది కరోనా. ఒక్కొక్కరు ఒక్కో పాఠం
నేర్చుకున్నారు. డబ్బు, పేరు కంటే జీవితం చాలా ముఖ్యమంత్రి ఎంతోమంది గ్రహించారు. మరి ఈ
కరోనా, నాగార్జునకు నేర్పిన పాఠం ఏంటి?

ఇదే విషయంపై నాగ్ స్పందించాడు. మనం ఎంత ఎదిగినా గొప్పోళ్లం కాదనే విషయాన్ని కరోనా తనకు
నేర్పించిందని చెప్పుకొచ్చాడు.

“ఈ కరోనా టైమ్ లో ఎంతో సహనం, మానవత్వం నాకు అబ్బింది. నేనే గొప్ప అనుకోవద్దు. ఏ టైమ్ లోనైనా మనం తుడిచిపెట్టుకుపోతాం అనే విషయాన్ని కరోనా వల్ల నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే
ప్రపంచమే తుడిచిపెట్టుకుపోతోంది. మనం ఎంత. సో.. మనం చాలా పెద్ద, గొప్ప అనే ఫీలింగ్
వదిలేయాలి.”

ఇలా కరోనా తనకు నేర్పించిన పాఠాన్ని బయటపెట్టాడు నాగార్జున. లాక్ డౌన్ టైమ్ లో కుటుంబంతో
క్వాలిటీ టైమ్ గడిపే అవకాశం దక్కిందంటున్న నాగ్.. త్వరలోనే ఓటీటీలో ఒరిజినల్ సినిమా
చేయబోతున్నట్టు ప్రకటించాడు.