ఆర్ఆర్ఆర్.. మరో మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ నుంచి మరో ప్రకటన వచ్చేసింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్
పేరిట ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి మేకింగ్
వీడియోస్ కొత్తకాదు. ఇప్పటికే 2-3 వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ 15న రాబోతున్న
మేకింగ్ వీడియో మాత్రం చాలా స్పెషల్.

ఎందుకంటే, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారట. ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలిసి ఉన్న
ఫొటోలు మాత్రమే చూశాం. కానీ మేకింగ్ వీడియోలో ఇద్దరూ కలిసి నటించిన వీడియోని చూపిస్తారనే టాక్
నడుస్తోంది. మరోవైపు ఈ వీడియోతోనే సినిమాకు అధికారికంగా ప్రచారం ప్రారంభించాలని
అనుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అప్ డేట్ ను ఈమధ్యే యూనిట్ బయటపెట్టింది. 2 పాటలు మినహా
షూటింగ్ మొత్తం పూర్తయింది. టాకీ పూర్తయింది కాబట్టి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని రాజమౌళి
అనుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో నుంచే ఆ ప్రచార పర్వం మొదలుకాబోతోంది. అక్టోబర్
13న దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతోంది ఆర్ఆర్ఆర్.