హైదరాబాద్ లో అఖండ హంగామా

సెకెండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తున్న అఖండ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది.
హైదరాబాద్ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు మొదలైంది.
హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సెట్స్ పైకి వచ్చారు.

ఇవాళ్టి నుంచి సినిమా మొత్తం పూర్తయ్యేవరకు ఏకథాటిగా షూటింగ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది.
ఈ మేరకు కాల్షీట్లు, షెడ్యూల్స్ అన్నీ ఫిక్స్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. తమన్ ఈ సినిమాకు
సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీ దాటిపోయింది. ప్రస్తుతం నడుస్తున్న
షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. ఆచార్య సినిమా వినాయక చవితికి
వస్తుందనే టాక్ నడుస్తోంది. ఆ మూవీకి 10 రోజుల ముందు లేదా 10 రోజుల తర్వాత అఖండ సినిమాను
థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.