రామారావుగా మారిన రవితేజ

మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి
నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రానికి `రామారావు ఆన్
డ్యూటీ` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ రోజు ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది
చిత్ర యూనిట్‌.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ర‌వితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూప‌ర్‌
స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే నిజాయితీ మరియు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా
ర‌వితేజ నటించార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో బి. రామారావుగా ప్రమాణ స్వీకారపు లేఖ
కూడా ఉంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని బ్యాక్‌గ్రౌండ్ లో చూడవచ్చు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే `రామారావు ఆన్ డ్యూటీ` రియ‌ల్ ఇన్స్‌టెండ్స్ ఆధారంగా ఒక
యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ర‌వితేజ‌,
హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోన్న‌ దివ్యాంశ కౌశిక్ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు
చిత్రీక‌రిస్తున్నారు.