హిట్ కాంబో మళ్లీ కలుస్తోంది

గోపీచంద్ కు 2 హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో లౌక్యం, లక్ష్యం
సినిమాలొచ్చాయి. రెండూ మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్
మూవీ రాబోతోంది. దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. రేపోమాపో అధికారిక ప్రకటన వస్తుంది.

సాక్ష్యం సినిమాతో గట్టి దెబ్బ తిన్నాడు శ్రీవాస్. బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఆ సినిమా డిజాస్టర్
అయింది. అప్పట్నుంచి గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. మధ్యలో డీవీవీ దానయ్య కొడుకును హీరోగా
పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అది ఎంతవరకు వచ్చిందో తెలీదు కానీ, ఇప్పుడు
గోపీచంద్ సినిమాను మాత్రం లాక్ చేశాడు.

ప్రస్తుతం గోపీచంద్ చేతిలో 2 సినిమాలున్నాయి. మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా
చేస్తున్నాడు. దీనికంటే ముందే సీటీమార్ సినిమాను పూర్తిచేశాడు. మారుతితో చేస్తున్న సినిమా ఆగస్ట్
నాటికి పూర్తవుతుంది. ఆ వెంటనే శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.