భయపెట్టిన సినిమాకు సీక్వెల్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ర‌మేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన
విజయం సాధించింది. ప్రస్తుతం రమేష్‌ వర్మ మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్‌
ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

దర్శకుడు రమేష్‌ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్ర‌క‌టించారు అలాగే దానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను
విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రాక్షసుడు 2’ టైటిల్‌ ఖరారు చేశారు.‘హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌’ అనేది
ట్యాగ్‌లైన్‌. ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం
కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఓ స్టార్‌ హీరో పేరు త్వరలో వెల్లడించనున్నారు.

ఇక టైటిల్‌ పోస్టర్‌ విషయానికి వస్తే…ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన
వెనకాల ఓ చైన్‌కు ర‌క్తంతో త‌డిసిన ప‌దునైన‌ కత్తి వేలాడుతుండ‌డం మ‌నం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న
ఈ పోస్ట‌ర్లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతున్నాయి.

డిఫరెంట్‌ సెటప్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌కు
తగ్గట్లుగానే ‘రాక్షసుడు 2’ చిత్రం ‘రాక్షసుడు’ కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనుంది.