తాప్సి మనసులో మాట

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తన మనసును ఆవిష్కరించింది హీరోయిన్ తాప్సి.
తన రొటీన్ లైఫ్ తో పాటు, జీవితంలో తనకు ఏమిష్టమో, తన జీవన సూత్రం ఏంటో బయటపెట్టింది.

సింపుల్ గా జీవించడం తాప్సికి ఇష్టమంట. షూటింగ్స్ లేకపోతే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుందట.
చెల్లెలు, కుటుంబ సభ్యులతో కాలం గడిపేస్తుందట. మరీ ముఖ్యంగా చెల్లెలు, ఫ్రెండ్స్ తో కలిసి
సినిమాలు చూడడం, తినడం చాలా ఇష్టమని చెబుతోంది.

ఇక తన డైలీ రొటీన్ గురించి చెబుతూ.. ఉదయాన్నే లేవడం తాప్సికి అలవాటు అంట. సూర్యోదయాలు
చూడడమంటే చాలా ఇష్టమని, అందుకే పొద్దున్నే లేస్తానని చెబుతోంది. లేచిన వెంటనే జిమ్ చేస్తుందట.
ఇలా తన రోజును ప్రారంభిస్తుందట. ఇక రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీరు తాగి
పడుకుంటుందట.