అల్లు అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ

‘అల్లు’ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమతో పెనవేసుకున్నారు. అల్లు
రామలింగయ్య ప్రారంభించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్
హీరో అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా
ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో సమంత అక్కినేని లీడ్ రోల్ చేస్తూ‌ పాన్ ఇండియా స్థాయిలో
తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. ఈ మూవీలో బేబి ఆర్హ
యువరాజు భరతుడి చిన్ననాటి పాత్రలో న‌టిస్తోంది.

ఈరోజు అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి
చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. బన్నీ కూతురు రాకతో శాకుంతలం సినిమాకు మరింత క్రేజ్
పెరిగింది.