కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ

లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి
దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది.

జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ
సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

చేసిన ఒక్క సినిమాతోనే క్రేజీగా మారాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన
ఈ హీరో, ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నాడు. ఎస్ఆర్ కల్యాణ మండపం రిలీజ్ కు రెడీ అయింది.
సెబాస్టియన్ సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అటు సమ్మతమే అనే
మరో రొమాంటిక్ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ 3 సినిమాలు కాకుండా, ఇప్పుడు కోడి రామకృష్ణ కూతురు
నిర్మాతగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు ఈ హీరో.