క్రాస్ టైమ్ జానర్ లో శర్వా

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. ఈ చిత్రం ద్వారా శ్రీ
కార్తిక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్
ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి
త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. కేవలం ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ మాత్రమే కాదు, క్రాస్ టైమ్
జానర్ కూడా ఇందులో ఉంది. అంటే రెండు కాలాలకు సంబంధించిన కథతో ఇది వస్తోంది.

తాజాగా సినిమాకు సంబంిదంచి శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌తో ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల
చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదీని కోరడం, అలాగే మ్యూజిక్
ఇన్స్‌ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో
శర్వానంద్ గిటార్ వాయించడం మ‌నం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి
స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం
విశేషం. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్ తో
ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా
ఉంటుంద‌ని అంటోంది సినిమా యూనిట్.