ప్రభాస్ సలార్ మూవీ అప్ డేట్స్

prabhas salaar movie

ప్రభాస్ సలార్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ఫిక్స్ అయింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ
సినిమా కొత్త షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఈ
సెట్ లోనే ప్రభాస్ పై భారీ యాక్షన్ సీన్ తీయబోతున్నారు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ ఇది. దీని కోసం ప్రత్యేకంగా ఫారిన్ ఫైట్ మాస్టర్స్ ను తీసుకున్నారు.

ఈ షెడ్యూల్ కంటే ముందు ఆదిపురుష్ సినిమా షెడ్యూల్ ను పూర్తిచేయబోతున్నాడు ప్రభాస్. త్వరలోనే
ఆదిపురుష్ 10 రోజుల షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సలార్
మొదలవుతుంది. ఈసారి షూట్ లో శృతిహాసన్ కూడా పాల్గొంటుందని సమాచారం.

ఇటలీ నుంచి ఈరోజే హైదరాబాద్ వచ్చాడు ప్రభాస్. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్
పూర్తిచేశాడు. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 90శాతం షూట్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో
మరో చిన్న షెడ్యూల్ ఉంది.