శర్వానంద్ కోసం వచ్చిన రష్మిక

శర్వానంద్ ప్ర‌స్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. శర్వానంద్‌ నటించిన ‘ఒకే ఒక జీవితం’
విడుదలకు సిద్ధమ‌వుతుండగా, ‘మహాసముద్రం’, సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా
జరుగుతున్నాయి. దీంతో తన పూర్తి ఫోకస్‌ను తన లేటెస్ట్‌ మూవీ ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాపై
పెట్టాడు శర్వా. ఈ మూడు వేటికవే డిఫరెంట్ మూవీస్ కావడం విశేషం.

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. శర్వానంద్,
రష్మిక కాంబోలో ఇదే తొలి చిత్రం. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’
చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ప్రొడ్యూసర్‌ సుధాకర్‌
చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న‌ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సంద‌ర్భంగా
విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక స‌హా సినిమాటోగ్రాఫ‌ర్ సుజిత్ సారంగ్‌ను మ‌నం చూడొచ్చు.
ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌ల‌పై కొన్ని కీల‌క‌స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌.
ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయి. కిశోర్‌ తిరుమల
మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారు.