లుంగీ కట్టిన నాగశౌర్య

నాగశౌర్య, డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న రొమాంటిక్‌
ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన
తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్‌ చేసే హీలేరియస్‌ సీన్స్‌ను
తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్‌.

ఈ సందర్భంగా ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను హీరో నాగశౌర్య షేర్‌ చేశారు. ఈ వర్కింగ్‌ స్టిల్‌ బట్టి ఈ
సినిమాలో హీలేరియస్‌ సీన్స్‌ అద్భుతంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయని, ముఖ్యంగా నాగశౌర్య,
బ్రహ్మాజీల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను షేర్‌ చేస్తూ
బ్రహ్మాజీని నాగౌశర్య తమ్ముడు అని సంభోదించడం ఈ సినిమాలోని వినోదం ఎంత హిలేరియస్‌ అర్థం
చేసుకోవచ్చు. ‘‘ నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి కావాలి.
దయచేసి కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించండి’’ అని ట్వీట్‌ చేశారు నాగశౌర్య. ఈ స్టిల్ లో
నటులిద్దరూ లుంగీలు కట్టుకొని నిలబడ్డారు.

తన గత సినిమాలో ఎప్పుడు చేయని ఓ ప్రత్యేకమైన హీరో క్యారెక్టర్‌లో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు
నాగశౌర్య. ఆయ‌న‌ క్యారెక్టర్‌ ఆసక్తికరంగా ఉండ‌బోతుంది. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా షీర్లే సేతియా
న‌టిస్తోంది. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, ఇప్పటి ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు రాధిక ఈ చిత్రంలో ఓ కీలక
పాత్ర పోషిస్తున్నారు.