భర్త విడాకులపై ప్రియమణి స్పందన

ప్రియమణి భర్త ముస్తాఫా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముస్తాఫా మొదటి భార్య ఆయేషా, తన
మాజీ భర్తపై అరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే ముస్తాఫా, ప్రియమణిని పెళ్లి
చేసుకున్నాడని ఆమె ఆరోపించింది.

దీనిపై ముస్తాఫా అల్రెడీ స్పందించాడు. ఆయేషాకు తన సంప్రదాయపద్ధతిలో విడాకులు ఇచ్చానని,
ప్రస్తుతం పిల్లల యోగక్షేమాలు కూడా తనే చూసుకుంటున్నానని, వాళ్లకు ప్రతినెల డబ్బులు
పంపిస్తున్నానని వివరణ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. ఆయేషా డబ్బు కోసం తనపై ఆరోపణలు
చేస్తోందని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యవహారంపై ప్రియమణి స్పందించింది.

ముస్తాఫా తను ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, ఇది చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారని
వ్యాఖ్యానించింది. ఇద్దరం ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ సాయంత్రం ఓ టైమ్ కేటాయించి
మాట్లాడుకుంటామని తెలిపింది. బిజినెస్ పని మీద ముస్తాఫా అమెరికా వెళ్లినప్పటికీ.. వీడియో కాల్ లో
ఇద్దరం మాట్లాడుకుంటామని ప్రియమణి వెల్లడించింది.

ఒకవేళ మాట్లాడుకోవడం కుదరకపోతే మెసేజీలైనా పెట్టుకుంటామని, రెగ్యులర్ గా టచ్ లో ఉంటామని
తెలిపింది. ముస్తాఫాది తనది ఇప్పటి బంధం కాదని, తమ అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదని
ప్రకటించింది ప్రియమణి.