భర్త అరెస్ట్ పై శిల్పాశెట్టి స్పందన

పోర్న్ రాకెట్ కేసులో శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతడు అరెస్ట్
అయిన రోజు నుంచి మీడియాకు కనిపించలేదు శిల్పాషెట్టి. కనీసం తన అభిప్రాయాన్ని కూడా
వెల్లడించలేదు. అలా 4 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఈ అమ్మడు, ఎట్టకేలకు తన భర్త అరెస్ట్ పై
స్పందించింది. నేరుగా స్పందించకుండా.. ఓ కొటేషన్ ను మాత్రం పెట్టింది.

ప్రముఖ రచయిత జేమ్స్ తర్బార్ రాసిన ఓ నవలలోని కొన్ని వాక్యాల్ని శిల్పాషెట్టి కోట్ చేసింది. “గట్టిగా
ఊపిరి పీల్చుకున్నాను. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసింది. గతంలో ఎన్నో సవాళ్లు
తట్టుకున్నాను. అదే విధంగా భవిష్యత్తులోనూ సవాళ్లను ఎదుర్కొంటాను. ఏం జరిగినా, నా జీవితాన్ని నేను
జీవిస్తాను. దాన్ని ఎవరూ ఆపలేరు”

ఇలా రాజ్ కుంద్రా అరెస్ట్ పై నర్మగర్బంగా స్పందించింది శిల్పాషెట్టి. ముంబయి శివార్లలో ఉన్న ఓ చిన్న
దీవిలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతుందనే సమాచారంలో వెళ్లిన పోలీసులు, మొత్తం 11 మందిని
అరెస్ట్ చేశారు. వీళ్లను విచారించిన తర్వాత దీని వెనక రాజ్ కుంద్రా ఉన్నాడనే విషయాన్ని
నిర్థారించుకున్నారు. అశ్లీల చిత్రాలకు మారుపేరుగా నిలిచిన హాట్ షాట్స్ అనే యాప్ ఇతడిదేననే
విషయాన్ని గుర్తించారు పోలీసులు.