నారప్పను ఆకాశానికెత్తేసిన చిరంజీవి

వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఓటీటీలోకొచ్చింది. తాజాగా స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా
క్రిటిక్స్ మెప్పు పొందింది. అంతా ఈ సినిమాకు మంచి రివ్యూస్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా వెంకీ నటనను
అందరూ ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరిపోయారు.

నారప్ప సినిమాను చూశారు చిరంజీవి. సినిమాలో వెంకీ నటన చూసి స్టన్ అయిపోయారు. వెంటనే వెంకీకి
ఆడియో మెసేజ్ పెట్టారు. ఈ సినిమాతో నటుడిగా వెంకటేష్ ఎన్నో మెట్లు పైకెక్కారని అన్నారు చిరంజీవి.
వెంకీ కెరీర్ లోనే టాప్-5 మూవీస్ లో ఒకటిగా నారప్ప నిలిచిపోతుందన్న చిరంజీవి.. వెంకటేశ్ కు
ప్రత్యేకంగా అభినందలు అందజేశారు.

ఓ మంచి సినిమా వస్తే అభినందించడం చిరంజీవికి అలవాటు. హీరో ఎవరైనా, సినిమా బాగుంటే
మెచ్చుకోవడం చిరంజీవి హాబీ. నారప్పను కూడా అలానే మెచ్చుకున్నారు. చిరంజీవి మెచ్చుకోలుతో వెంకీ
ఉబ్బితబ్బిబ్బయ్యాడు. చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది నారప్ప.
తమిళ్ లో వచ్చిన అసురన్ అనే సినిమాకు ఇది రీమేక్.