ప్రభాస్ కొత్త సినిమా మొదలైంది

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఏడాదిగా నలుగుతున్న ప్రాజెక్టు సెట్స్ పైకొచ్చింది. ఈరోజు ఈ
సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు.
రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమా షూటింగ్‌ కోసం అమితాబ్‌బచ్చన్‌ హైదరాబాద్‌ వచ్చారు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో
ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో
అమితాబచ్చన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు
నాగ్‌ అశ్విన్‌. బిగ్‌బి అమితామ్ బ‌చ్చ‌న్ మీద చిత్రీక‌రించిన ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌కు ప్రభాస్‌ క్లాప్‌ కొట్టాడు.

ఈ సినిమాకు ప్రాజెక్ట్-కే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా కథ, కాన్సెప్ట్, తెరకెక్కించే విధానం ప్రేక్షకులకు
కొత్తగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇండియన్‌ పవర్‌హౌస్‌ యాక్టర్స్, అత్యున్నత సాంకేతిక
నిపుణులు పని చేస్తారు. దీపిక పదుకోన్ ఇందులో హీరోయిన్.

ఈ సినిమా చిత్రీకరణ కోసం రామోజీఫిల్మ్‌సిటీలో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించింది చిత్ర యూనిట్‌.
ఇండియన్‌ సినిమాల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న సినిమా సెట్‌ ఇది. ఈ మూవీకి 500 కోట్ల
రూపాయల బడ్జెట్ కేటాయించాడు నిర్మాత అశ్వనీదత్.