మరో ఐటెంసాంగ్ కు ఓకే చెప్పిన తమన్న

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు తమన్న. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు
ఐటెంసాంగ్స్ చేస్తోంది. ఇంకోవైపు ఓటీటీలో అడుగుపెట్టింది. మరోపక్క బుల్లితెరపై కూడా అడుగులు
వేసింది. ఇప్పుడీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తాజాగా మరో ఐటెంసాంగ్ కు ఓకే చెప్పింది మిల్కీబ్యూటీ

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది తమన్న. కిరణ్ కొర్రపాటి
దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రీ-క్లైమాక్స్ కు ముందు ఓ స్పెషల్ సాంగ్ కు స్కోప్ ఉంది. ఆ
పాటను తమన్నతో చేయించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

దీనికి సంబంధించి మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇప్పటికే అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు. ఆ పాటలో తన
గ్లామర్ చూపించడంతో పాటు స్టెప్స్ తో అదరగొట్టబోతోంది తమన్న. బాక్సింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న
గని సినిమాతో సయీ మంజ్రేకర్, టాలీవుడ్ కు పరిచయమౌతోంది.