సెన్సార్ పూర్తయింది.. రిలీజ్ బాకీ ఉంది!

డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల
హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌.
‘బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో
ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ మ‌రోసారి ‘తిమ్మరుసు’గా మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా
సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. జూలై 30న సినిమాను భారీ లెవల్లో విడుద‌ల
చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్
చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం
వహించారు. రీసెంట్‌గా సినిమాలో హీరో స‌త్య‌దేవ్‌ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసేలా రూపొందించిన
ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను స‌మంత అక్కినేని విడుద‌ల చేయ‌గా పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.
అలాగే టీజ‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న్యాయం కోసం ఎంత దూర‌మైనా వెళ్లే తెలివైన లాయ‌ర్ పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ప్రియాంక
జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సత్యదేవ్. ఇప్పటికే
నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఈ సినిమా సక్సెస్ అయితే హీరోగా తన
రేంజ్ ను మరింత పెంచుకోవడం ఖాయం.