ఇష్క్ ట్రయిలర్ రివ్యూ

మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది ఇష్క్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి థియేట్రికల్
ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. ట్రయిలర్ లో తేజ సజ్జా, ప్రియా వారియర్ లుక్స్ సింపుల్ గా ఉన్నాయి. మన వీధిలో కనిపించే కుర్రాడు, అమ్మాయి లుక్స్ లోనే వీళ్లిద్దరూ కనిపించారు.

ఇక ట్రయిలర్ చూస్తే, సినిమా స్టోరీ ఏంటనేది ఏమాత్రం అంచనా వేసే విధంగా లేదు. పక్కా సస్పెన్స్
మెయింటైన్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తేజ సజ్జ ఎక్స్ ప్రెషన్స్ హైలెట్ గా నిలిచాయి.

మలయాళంలో సూపర్ హిట్టయిన ఇష్క్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు వెర్షన్ కు సంబంధించి కేవలం పాత్రల పేర్లు మాత్రమే మార్చారు. అంతకుమించి ఎలాంటి మార్పుచేర్పులు
చేయలేదు. మక్కికిమక్కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా, తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో
చూడాలి.