నవరసాలు ఒకేసారి..

ఓటీటీ వచ్చిన తర్వాత కంటెంట్ లో కొత్తదనం పెరిగింది. బడా బడా డైరెక్టర్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. తాజాగా దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న ఓ మూవీ టీజర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో హల్ చల్ చేస్తుంది.

భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ పేరు ‘నవరస’. అంటే ఇందులో నవరసాలు ఉంటాయన్న మాట. టీజర్ చూస్తే ఇది చాలా విన్నూత్నమైన సబ్జెక్ట్‌గా తెలుస్తుంది. 9 స్టోరీస్ , 9 ఎమోషన్స్ అనే ఈ సిరీస్ ట్యాగ్ లైన్.. సిరీస్ పై అంచనాలు రేపుతోంది. టీజర్‌‌లో అందరి లుక్స్‌ కొత్తగా కనిపిస్తున్నాయి. తొమ్మిది కథలతో నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, అరవింద్‌ స్వామి, ఐశ్వర్యరాజేశ్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ ఆగస్టు 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

తమిళ దర్శకుడు జయేంద్ర, మణిరత్నం కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్ ను తొమ్మిది కథలుంటాయి. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఈ తొమ్మిది కథలను డైరెక్ట్ చేస్తున్నారు.