బిచ్చగాడు-2కు రంగం సిద్ధమైంది

తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే.. తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు.

తెలుగులో సైతం అయన సంగీతం అందించిన కొన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. ఎడిటర్ గా కూడా
అయన కొన్ని సినిమాలకు పనిచేయగా ప్రస్తుతం తొలిసారి అయన దర్శకత్వం వహిస్తుండడం విశేషం..
విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు సినిమా కి కొనసాగింపుగా బిచ్చగాడు 2 సినిమా ని అయన తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు..

ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.