నేను చాలా స్లో – ప్రియా వారియర్

కథలు, సినిమాల ఎంపికలో తను చాలా స్లో అంటోంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఇష్క్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. తాజా చిత్రాన్ని కేవలం 2 రోజుల్లో ఓకే చేశానని చెబుతోంది.

“ఇష్క్‌ సినిమాను నేను సైన్‌ చేయడం చాలా తొందరగా జరిగిపోయింది. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను కానీ ఈ సినిమాకి మాత్రం 2 రోజుల్లోనే ఓకే చేశాను. మలయాళ ఇష్క్‌ చిత్రాన్ని నేను చూశాను. ఈ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్‌ అంశాలు నచ్చాయి. దీంతో ఇష్క్‌ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాను. ఈ సినిమా రోటిన్‌ లవ్‌స్టోరీలా ఉండదు. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.”

ఓ సినిమాను అంగీకరించే ముందు కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అని మాత్రమే
చూస్తానంటోంది ప్రియా వారియర్. హీరో ఎవరు, బ్యానర్ ఏంటి అనే విషయాల్ని పట్టించుకోనంటోంది. ఇక
టాలీవుడ్ పై స్పందిస్తూ.. మల్లూవుడ్ తర్వాత తనకు టాలీవుడ్ రెండో ఇల్లుగా మారిపోయిందని చెప్పుకొచ్చింది.