సుందరి సిద్ధమైంది.. థియేటర్లలోనే..!

రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుద‌ల‌కి సిద్ద‌మైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‏లో నటిస్తున్న ‘సుంద‌రి` సినిమా ఆగ‌స్ట్‌13న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది.

నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ
ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌, `ది ఆల్టిమేట్ డిసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌. సురేష్ బొబ్బ‌లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మ‌ణికాంత్ ఎడిట‌ర్ గా వర్క్ చేస్తున్నాడు.

నిజానికి ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇద్దాం అనుకున్నారు. ఆ మేరకు సంప్రదింపులు కూడా
జరిపారు. కానీ ఎందుకో ఓటీటీ జనాలకు ఈ సినిమా నచ్చలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య
థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. రిలీజ్ తర్వాత ఏమైనా కాస్త పాజిటివ్ టాక్ వస్తే, వెంటనే ఓటీటీ,
శాటిలైట్ క్లోజ్ చేయాలనేది నిర్మాతల ఆలోచన.