సర్కారువారి పాట ఫస్ట్ లుక్ రెడీ

మహేశ్‌బాబు కొత్త సినిమా `స‌ర్కారువారి పాట‌`. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు పరశురామ్
దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం
హైదరాబాద్‌లో జరుగుతుంది.

‘సర్కారువారి పాట’ టైటిల్, విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తాజాగా
మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను (ఫస్ట్ లుక్) ఈ నెల 31న విడుదల చేయడానికి
చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. ఈ ఫ‌స్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో మహేశ్‌బాబు చేతిలో బ్యాగ్‌ పట్టుకుని ఉన్నారు. అదే విధంగా బైక్‌లు, కార్లులతో పాటు కొందమంది రౌడీల‌ను మ‌నం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ పోస్టర్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సంబంధించినది అని తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం
అందిస్తున్నాడు.