మహేష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఎట్టకేలకు సర్కారువారి పాట నుంచి మహేష్ లుక్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్
అయ్యాడు మహేష్. హెయిర్ స్టయిల్ మార్చడంతో పాటు కాస్త రఫ్ లుక్ లోకి మారాడు. ఆ లుక్ ను ఈరోజు
రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ లో స్టయిలిష్ గా కారు నుంచి దిగుతున్న మహేష్ ను చూపించారు. చూస్తుంటే.. ఇదొక ఫైట్ సీన్ కు సంబంధించిన ఎపిసోడ్ లా అనిపిస్తోంది. ఎందుకంటే, కారు ముందు అద్దం పగిలి ఉంది. ఈ లుక్ కు
కొనసాగింపుగా.. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు నాడు ఓ సర్ ప్రైజ్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇదే ఎపిసోడ్ కు సంబంధించిన ఫైట్ సీన్ ను మేకర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ లో భాగంగా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. సర్కారువారి పాట సినిమాను
సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఇంతకుముందు
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు సర్కారువారి పాట రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సర్కారువారి పాట సినిమా. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.