మొన్న సారీ.. ఈరోజు థ్యాంక్స్

నారప్ప సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. దీనిపై హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు అభిమానులకు సారీ చెప్పారు. అలా ఓటీటీలో డైరక్ట్ గా రిలీజైన నారప్ప సినిమా అందరి ఆదరణ పొందిందంటున్నాడు వెంకీ. ఈ సందర్భంగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాడు.

“నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో
నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్‌ సమయంలో నారప్ప క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. నారప్ప మంచి ఎక్స్‌పీరియన్స్‌. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చినప్పటికీ వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి
అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్‌.”

నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాటను అనంతశ్రీరామ్‌ చాలా బాగా రాశాడంటున్నాడు వెంకీ. ఆ పాట
విన్నప్పుడు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తామా? అనే ఉత్సాహం వచ్చేదని చెప్పుకొచ్చాడు. అసురన్ లాంటి
మంచి సినిమా లేకపోతే నారప్ప వచ్చేది కాదన్న వెంకీ, ఈ సందర్భంగా ధనుష్ కు మరోసారి థ్యాంక్స్
చెప్పాడు.