బంగార్రాజుకు ముహూర్తం ఫిక్స్

ఎట్టకేలకు బంగార్రాజు ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ సినిమా ఈ నెల్లోనే సెట్స్ పైకి రాబోతోంది.
నాగార్జున-కల్యాణ కృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న బంగార్రాజు సినిమా ఈనెల 20 నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే నాగ్, రమ్యకృష్ణ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతోంది బంగార్రాజు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా
నటించబోతున్నాడు. అతడికి హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనలైజ్ చేశారు. మనం తర్వాత నాగ్-చైతూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే.

తాజా సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రెడీ చేయాలని
అనుకుంటున్నారు. అదే కనుక నిజమైతే, సంక్రాంతి పోటీ పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మహేష్, ప్రభాస్, పవన్ తమ సినిమాల్ని సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు బంగార్రాజుతో నాగార్జున కూడా రేసులో చేరేలా కనిపిస్తున్నాడు.