సినిమాల లైనప్ మార్చిన చిరు

ఆమధ్య ఒకేసారి 4 సినిమాల్ని ప్రకటించారు చిరంజీవి. చెప్పినట్టుగానే ఒక్కో సినిమాను నిదానంగా
పూర్తిచేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన సినిమాల లైనప్ ను చిరంజీవి మార్చినట్టు
తెలుస్తోంది. లేట్ అవుతుందనుకున్న సినిమాను ఆయన కాస్త ముందుకు జరిపినట్టు సమాచారం.

త్వరలోనే లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయబోతున్నారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత లెక్కప్రకారం బాబి
దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ ఆ మూవీ కాకుండా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ను ముందుకు తీసుకొచ్చారు చిరంజీవి.

బాబి సినిమాకు సంబంధించి ఇంకా చాలా మార్పుచేర్పులు చేయాల్సి ఉంది. అది స్ట్రయిట్ సినిమా. అదే
మెహర్ రమేశ్ సినిమాకు ఆ ఇబ్బంది లేదు. వేదాళం అనేది రీమేక్ ప్రాజెక్టు. కాబట్టి వీటిని ముందుగా
పూర్తిచేసి, ఆ తర్వాత బాబి దర్శకత్వంలో చేయబోయే స్ట్రయిట్ మూవీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని
అనుకుంటున్నారట చిరంజీవి.