ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్ డేట్స్

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మిగిలింది ఒకే ఒక్క పాట. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఈ ఒక్క పాట షూటింగ్ కూడా పూర్తయితే టోటల్ గా సినిమాకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు. ప్రస్తుతం రాజమౌళి అదే పనిలో ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ ఆఖరి సాంగ్ షూటింగ్ కోసం యూనిట్ అంతా యూరోప్ పయనమైంది. నిన్ననే యూనిట్ యూరోప్ బయల్దేరి వెళ్లింది. తూర్పు యూరోప్ లోని కొన్ని అందమైన ప్రదేశాల్లో, ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. బాహుబలి సినిమా కోసం ఎలాగైతే, ఉక్రెయిన్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని అందమైన ప్రదేశాల్ని రాజమౌళి చూపించాడో.. ఈస్ట్ యూరోప్ లో కూడా అలాంటి అందమైన ప్రదేశాల్ని ఆర్ఆర్ఆర్ లో చూపించబోతున్నాడు జక్కన్న.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. నిన్నట్నుంచి లిరికల్ వీడియోల విడుదల కార్యక్రమాన్ని కూడా షురూ చేశారు. ఇఁదులో భాగంగా దోస్తీ సాంగ్ ను రిలీజ్ చేశారు.