అతి త్వరలోనే గూఢచారి పార్ట్-2

దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ `మేజ‌ర్‌`తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ హీరో అడివి శేష్‌. ఈ సినిమా మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వ‌గానే అడివి శేష్ త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం `గూఢ‌చారి` సినిమా సీక్వెల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు.

`గూఢ‌చారి` సినిమా విడుద‌లై ఇవాళ్టికి (ఆగ‌స్ట్‌3) సరిగ్గా మూడేళ్లు పూర్త‌య్యాయి. దీంతో ఈ నెల‌లోనే `గూఢ‌చారి` సీక్వెల్‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న‌ చేయ‌బోతున్నారు. “గూఢ‌చారి మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. ఈ నెల‌లోనే ప్ర‌క‌ట‌న ఉంటుంది` అంటూ మేక‌ర్స్ తెలిపారు.

“ఈ రోజుతో గూఢ‌చారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డి చూశారు. ఆగ‌స్ట్ నెల నాకు బాగా క‌లిసొస్తుంది. ఈ నెల‌లోనే నా నెక్ట్స్ సినిమా G2(గూఢ‌చారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను“ అంటూ అడివిశేష్ ట్వీట్ చేశాడు. గూఢ‌చారి చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేశారు. మేజర్ సినిమాకు కూడా ఇతడే డైరక్టర్.