నాగార్జున కొత్త సినిమా అప్ డేట్స్

కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్రారంభ‌మైన సంగ‌తి
తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నారాయ‌ణ్ దాస్ నారంగ్‌,
పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ రేపట్నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. షామీర్ పేట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, విదేశాల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్‌ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకోనున్నాడట ప్రవీణ్
సత్తారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రియల్ స్టంట్స్, ఛేజ్ లు ఈ సినిమాలో చూపించబోతున్నారు. నాగార్జునను కంప్లీట్ యాక్షన్ లుక్ లో చూపించబోతోంది ఈ సినిమా.