సాహో దర్శకుడితో రామ్ చరణ్

ఆమధ్య రామ్ చరణ్ దర్శకుల లిస్ట్ లో చాలాపేర్లు వినిపించాయి. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి, సుజీత్ పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఎప్పుడైతే శంకర్ తో చరణ్ సినిమా ఎనౌన్స్ చేశాడో అప్పుడిక ఈ దర్శకుల పేర్లన్నీ పక్కకు వెళ్లిపోయాయి. అయితే ఆశ్చర్యంగా ఈ లిస్ట్ లోంచి సుజీత్ పేరు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది.

అవును.. ఓవైపు శంకర్ తో సినిమాకు రెడీ అవుతున్నప్పటికీ.. రెగ్యులర్ గా సుజీత్ తో స్టోరీ డిస్కషన్లు
చేస్తున్నాడట చరణ్. వీలైతే శంకర్ సినిమా తర్వాత సుజీత్ కే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు
తెలుస్తోంది. అయితే సుజీత్ కు అవకాశం ఇవ్వడం వెనక మరో కారణం కూడా కనిపిస్తోంది.

ఆమధ్య చిరంజీవితో సినిమా కోసం సుజీత్ ను తీసుకున్నారు. లూసిఫర్ సినిమాకు ముందుగా
మార్పుచేర్పులు చేసింది ఇతడే. ఆ తర్వాత ఆఖరి నిమిషంలో సుజీత్ ను తప్పించి, మోహన్ రాజాకు
భాధ్యతలు అప్పగించారు చిరంజీవి. అయితే అదే సమయంలో రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు
మాటిచ్చారట.

ఇచ్చిన మాట ప్రకారం.. సుజీత్ తో సినిమా చేసేందుకు చరణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కు ఇప్పటికే ఓ స్టోరీలైన్ వినిపించిన సుజీత్.. ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట.